ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ ప్రారంభించిన నరేష్ "ఉగ్రం" చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 07:20 PM

కామెడీ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన నటనను కనబరిచే అల్లరి నరేష్ సినీ కెరీర్ లో అరవైవ సినిమాగా రూపొందుతున్న చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
ఇటీవలే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా నిన్నటి నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. 
సినిమాను ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్లో నరేష్ లుక్ చాలా ఫియర్స్ఫుల్ గా ఉంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల నుండి స్పెషల్ అటెన్షన్ గ్రాస్ప్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa