ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత "యశోద" సినిమాపై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 07:42 PM

సౌత్ టాప్ సైరన్ సమంత నుండి చాన్నాళ్ల తరవాత రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం "యశోద". హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ మూవీ ఆంధ్రా మరియు తెలంగాణా హక్కులు అంటే తెలుగు రైట్స్ ఏషియన్ గ్రూప్ చేజిక్కించుకుందట. అలానే, అక్టోబర్ చివర్లో కానీ, నవంబర్ నెల మొదట్లోకానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్. ఐతే ఈ విషయాలపై మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వవలసి ఉంది.
ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీశర్మ, సంపత్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa