ఇటీవలే "ఏనుగు" చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ఆక్రోశం". అరుణ్ విజయ్ ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఏకైక పుత్రుడు.
GNR కుమారవేలన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మూవీ స్లైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై CH సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ సమర్పిస్తున్నారు. తమిళంలో 'సినం' గా విడుదల కాబోతున్న ఈ మూవీని తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సాబీర్ సంగీతం అందిస్తున్నారు.