ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన 'మనసంతా నువ్వే' సినిమాలో తూనీగ తూనీగ అంటూ సాగే పాటలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని కలిత తాజాగా పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సంగీతకారుడు విభర్ హసీజాతో ఆమె పెళ్లి ఘనంగా జరిగింది. బాలనటిగానే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్‌గా సుహానీ నటించింది. ఈ జంటకు సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.