బ్యూటీ కృతిశెట్టి "ఉప్పెన" సినిమాతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకుంది . వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన కృతి శెట్టి మొదటి సినిమా ఉప్పెన భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా తర్వాత కృతిశెట్టి నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో "శ్యామ్ సింగరాయ్" మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నాగ చైతన్య సరసన బంగార్రాజు సినిమాలో నటించి మరో హిట్ అందుకుంది. తాజాగా రామ్ పోతినేనితో చేసిన ది "వారియర్", నితిన్ హీరోగా వచ్చిన "మాచర్ల నియోజకవర్గం" బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే కృతిశెట్టికి వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.