ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ బాబు "AAGMC" నుండి వినూత్న ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 01:51 PM

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే ఒక వినూత్న ప్రకటన జరిగింది. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వెన్నెల కిషోర్ వాయిస్ తో పాడ్ క్యాస్ట్ సిరీస్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చెయ్యనున్నారు. పాడ్ క్యాస్ట్ ట్రెండ్ అనేది ఇక్కడకన్నా విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. సింపుల్ గా చెప్పాలంటే పాడ్ క్యాస్ట్ అంటే ఇంటర్నెట్ రేడియో అని అర్ధం.
ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ చేసారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. పోతే, సెప్టెంబర్ 16వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com