ఎన్ని ప్లాప్ లు వచ్చినా పట్టు వదలని విక్రమార్కుడు రామ్ గోపాల్ వర్మ.. ఇక మూవీలు తీయనంటూనే మరో మూవీకి వెంటనే శ్రీకారం చుట్టేస్తాడు.. ఆఫీసర్ డిజాస్టర్ అయినా మళ్లీ తన స్వంత బ్యానర్ లో ఒక మూవీ చేస్తున్నాడు..అదృష్టమేమిటంటే ఈ మూవీకి వర్మ నిర్మాత మాత్రమే..భైరవ గీత అంటూ తెలుగు- కన్నడ భాషలలో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది బాగా వయొలెంట్ లవ్ స్టోరీ అని.. గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు. అణగారిన వర్గాలపై భూస్వామ్య వ్యవస్థను ఎదిరించే ఓ వ్యక్తి ప్రేమకథను.. చాలా రియలిస్టిక్ గా చూపబోతున్నారట. కన్నడ నటుడు దాలి ధనుంజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి సిద్ధార్ద్ దర్శకుడు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.నవంబర్ 22వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ను నవంబర్ 3వ తేదిన విడుదల చేయనున్నాడు రామ్ గోపాల్ వర్మ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa