విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్స్ అమీర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ వినూత్న ప్రచారాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రంలోని సురయ్యా పాట ప్రోమోను చిత్రయూనిట్ రీసెంట్‌గా విడుదల చేసింది. చాలా ఫన్నీగా సాగే ఈ పాటలో కత్రినాకైఫ్ మెస్మరైజ్ చేసే స్టెప్పులతో అదరగొట్టింది. ప్రొమోలో కత్రినా శరీరాన్ని స్ప్రింగ్‌లా మెలికలు తిప్పుతూ చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అయితే ఈ స్టెప్పులు తనకైతే అంత సాధ్యమయే పనికాదన్నాడు అమీర్‌ఖాన్. తాజాగా ఇదే పాట తెలుగు వర్షెన్ కూడా విడుదల చేశారు. ఇది కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
చిత్రంలో ఫిరంగి పాత్రలో అమీర్‌ఖాన్ , సురయ్యా పాత్రలో కత్రినాకైఫ్ కనిపించనున్నారు. ఫాతిమా సనా షేక్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండగా, కల్నల్ ఫిలిప్ మెడోవ్స్ 1983లో రాసిన కన్ఫేషియన్స్ ఆఫ్ ఎ థగ్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యచోప్రా అత్యంత భారీ స్థాయిలో చిత్రం రూపొందింది. 300 కోట్ల రూపాయలతో ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ ఈ సినిమాని నిర్మించారు . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం సైరట్‌కు సంగీతం అందించిన అజయ్-అతుల్ ఈ చిత్రానికి పనిచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa