మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'జిన్నా' సినిమా టీజర్ ను ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం బుధవారం ప్రకటించింది. సూర్య డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఏవీఏ ఎంటర్టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళం, హిందీలో రిలీజ్ కానుంది.