మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా, ఈ సినిమా షూటింగ్ పనుల ఆలస్యం కారణంగా అక్టోబర్ 5న విడుదల కావడం లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది అనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుంది.
తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ విషయంపై నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పందించి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. 'గాడ్ ఫాదర్' సినిమా షెడ్యూల్ చేసిన తేదీ అంటే అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలవుతుందని మరియు ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థించారు. త్వరలో ప్రొమోషన్స్ ని కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలో విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.