టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". 'మన అమ్మానాన్నల కథ' శీర్షిక. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా పనిచేస్తున్నారు. కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరిగా ఈ సినిమాలోని గీతాలకు సాహిత్యమందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి కృష్ణవంశీ కృతజ్ఞతలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేసాడు. అందుకు ఒక ఆకతాయి నెటిజన్ 'ఇది పోయినట్టే' అని కామెంట్ చేసాడు. అంటే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమన్నట్టు ముందే జ్యోతిష్యం చెప్పాడు. ఐతే, ఈ నెటిజన్ నెగిటివ్ ట్వీట్ కు అనుభవజ్ఞుడైన కృష్ణవంశీ మాత్రం "గాడ్ బ్లెస్ యూ" అంటూ చాలా హుందాగా రిప్లై ఇచ్చారు. నెటిజన్ జోస్యం నిజమవ్వకూడదని, ఈ సినిమాతోనైనా కృష్ణవంశీ గ్రాండ్ సక్సెస్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు.