చాన్నాళ్ల నుండి వాయిదా పడుతూ వస్తున్న నాగశౌర్య "కృష్ణ వ్రిoద విహారి" చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన అంటే శనివారం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను పలకరించబోతుంది.
ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ముఖ్యంగా నాగశౌర్య అభిమానులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.