ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన శర్వానంద్ ఆ సినిమా తదుపరి ఒక విభిన్న కధాంశంతో తెరకెక్కిన "ఒకేఒక జీవితం" సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా రేపే విడుదల కాబోతుంది.
టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఒక విభిన్న కథకు బలమైన అమ్మ సెంటిమెంట్ ను జోడించిన విధానం ట్రైలర్ లో అద్భుతంగా చూపించింది చిత్రబృందం. దీంతో ఈ సినిమాపై చాలా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాను శ్రీ కార్తీక్ డైరెక్ట్ చెయ్యగా, రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.