కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే "కోబ్రా" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం విక్రమ్ కు గ్రాండ్ సక్సెస్ ను తీసుకొస్తుందని అభిమానులు ఆశపడ్డారు కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
దీంతో ఇప్పుడు విక్రమ్ అభిమానుల దృష్టాంతా ఆయన పా రంజిత్ తో చేస్తున్న సినిమాపైనే ఉంది. పా రంజిత్ లాస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో విక్రమ్ కు గట్టి హిట్ అందిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ గా పా రంజిత్ విక్రమ్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతానికి మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.