దేశవ్యాప్త ప్రేక్షకులను అలరించిన ఇండియాస్ మిస్టికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ "కార్తికేయ 2" సందడి థియేటర్లలో ఇంకా పూర్తి కాకముందే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ నెలాఖరు నుండి ప్రముఖ జీ 5 ఓటిటిలో కార్తికేయ 2 స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుందట.
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందూ మొండేటి డైరెక్షన్ చేసిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించాయి.