మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్తచిత్రం "జిన్నా" టీజర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. మంచు విష్ణు అండ్ టీం చేసే మాస్ కామెడీ తో ఫన్నీగా మొదలైన టీజర్ మధ్యలో యూ టర్న్ తీసుకుని హార్రర్ జోనర్ ని టచ్ చేసింది. అటు మాస్ కామెడీ, ఇటు హార్రర్ రెండూ కూడా చాలా రసవత్తరంగా సాగాయి. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు కానీ ఈ టీజర్ తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. చాన్నాళ్లుగా సాలిడ్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణు ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం.
ఈ సినిమాకు ఇషాన్ సూర్య డైరెక్టర్ కాగా, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. AVA ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్త బ్యానర్లపై విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.