టాలీవుడ్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ యువహీరో సంతోష్ శోభన్ తో 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' అనే సినిమాను రూపొందిస్తున్నారు.
కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా, లేటెస్ట్ గా సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేసారు. ఈ సినిమాలో ఫరియా 'వసుధ వర్మ' అనే పాత్రలో నటిస్తుంది. ఈ పాత్ర మంచి కిక్ బాక్సర్, అలానే ట్రావెల్ వ్లాగర్ కూడాను.
ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెల్లూరు సుదర్శన్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa