"పొన్నియిన్ సెల్వన్ (PS 1)" ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో, రెండ్రోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు అతిరథమహారధులందరూ తరలివచ్చారు.
లేటెస్ట్ గా ఈ సినిమా ఆడియో ఫుల్ ట్రాక్ లిస్ట్ అందరికి అందుబాటులోకొచ్చింది. యూట్యూబ్, ఐ ట్యూన్స్, ఆపిల్ ట్యూన్స్... ఇలా అన్నిరకాల మ్యూజిక్ యాప్స్ లోకి PS 1 ఆడియో ట్రాక్ లభ్యమవుతుంది.
రీసెంట్గా రిలీజైన ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం, మ్యూజిక్, BGM టాప్ నాచ్ గా ఉండడంతో అప్పటి వరకు సోసోగా ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. AR రెహ్మాన్ ఈ సినిమాకు ఫస్ట్ క్లాస్ మ్యూజిక్ ను అందించగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa