"అర్జున్ సురవరం" తదుపరి నిఖిల్ సిద్దార్థ్ నుండి వచ్చిన చిత్రం "కార్తికేయ 2". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి డైరెక్టర్.
ఆగస్టు 13వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉత్తరాది ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. నార్త్ లో ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యకున్నా పాజిటివ్ మౌత్ టాక్ తో, సూపర్ కలెక్షన్లతో ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుందంటే ఈ సినిమా నార్త్ వాళ్ళకి ఎంతలా నచ్చిందో అర్ధం చేసుకోవాలి. ఇటీవలే వంద కోట్ల కలెక్షన్ల సెలెబ్రేషన్స్ జరుపుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా 120 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక అతిధి పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa