సోషల్ మీడియాలో మహా చురుగ్గా ఉండే సమంత కొన్నాళ్ళబట్టి సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో సమంత అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు.
ఇన్నాళ్ళబట్టి ప్రేక్షకాభిమానులకు దూరంగా ఉన్న సమంత ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలా ఈ రోజు యశోద టీజర్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1800 పై చిలుకు థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శింపబడింది. ఇన్ని థియేటర్లలో ప్రదర్శింపబడిన తొలిచిత్రం ఇదే. ఈ క్రెడిట్ అంతా సామ్ కే దక్కుతుంది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకత్వంలో సైన్టిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, రావురమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa