యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". శ్రీధర్ గాదె ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. వెటరన్ డైరెక్టర్ SV కృష్ణారెడ్డి ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa