రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన "బ్రహ్మాస్త్ర" పాన్ ఇండియా భాషల్లో నిన్నే విడుదలైంది. అద్భుతమైన విజువల్ వండర్ గా, సనాతన హిందూ అస్త్రాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిషోతోనే సూపర్ హిట్ టాక్ అందుకుని, బాక్సాఫీస్ వద్ద తొలిరోజున బిగ్ నంబర్స్ ను నమోదు చేసింది.
ఆంధ్ర, తెలంగాణాలలో ఐతే, బ్రహ్మాస్త్ర సినిమా తొలిరోజున రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఫస్ట్ డే 5. 76 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ధూమ్ 3(4. 05) తొలి రోజు వసూళ్ల రికార్డును ఇట్టే బ్రేక్ చేసింది. ఇక, ఈ వీకెండ్ కు ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చెయ్యడం విశేషం.