లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ అయ్యిన భారీ బడ్జెట్ మరియు విజువల్ వండర్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ లేటెస్ట్ చిత్రంని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. మరి ఈ చిత్రం ఇండియాతో పాటు యూఎస్ లో కూడా భారీ అంచనాలు పెట్టుకొని రిలీజ్ కాగా..అప్పుడే రోజుకే ఈ చిత్రం రికార్డు మైల్ స్టోన్ 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసేసిందట. అలాగే 1 మిలియన్ కన్నా ఎక్కువ వసూళ్లనే మొదటి రోజుకి ఈ చిత్రం సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే బ్రహ్మాస్త్ర కి వరల్డ్ వైడ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నే దక్కినట్టు కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్ ఫిగర్ ఎంత వచ్చిందో చూడాలి. ఇక ఈ చిత్రంలో కింగ్ నాగ్, అమితాబ్ అలాగే షారుక్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.