సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'మహర్షి' చిత్రంలో రైతుగా నటించిన గురు స్వామి శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఇక 'మహర్షి' సినిమాలో మట్టికి, రైతుకు ఉన్న బంధాన్ని తెలుపుతూ ఆయన పలికిన డైలాగులు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. సినిమాలే కాకుండా విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి ఆయన ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.