యంగ్ హీరో శర్వానంద్ సినీ కెరీర్ లో 30వ సినిమాగా నిన్నే ప్రేక్షకుల ముందుకొచ్చింది "ఒకేఒక జీవితం" చిత్రం. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తొలి షో నుండే హిట్ టాక్ రావడం విశేషం.
లేటెస్ట్ గా ఈ మూవీ ఓటిటి భాగస్వామిపై అఫీషియల్ అప్డేట్ అందుతుంది. శర్వానంద్ గత చిత్రం "ఆడవాళ్ళూ మీకు జోహార్లు" సినిమా ఓటిటి హక్కులను కొనుగోలు చేసిన సోనీ లివ్ సంస్థే ఇప్పుడు ఒకేఒక జీవితం మూవీ డిజిటల్ హక్కులను కూడా కొనుక్కుంది. సో, ఒకేఒక జీవితం సినిమా సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ చెయ్యబడుతుందన్న మాట.
రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్కినేని అమలగారు కీలక పాత్రను పోషించారు. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యపాత్రల్లో నటించారు.