ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ "బ్రహ్మాస్త్ర" నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిషోతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్ గా పనిచేసిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలకపాత్రలు పోషించారు.
నిన్న థియేటర్లలోకి రావడంతో ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ పార్ట్నర్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ప్రఖ్యాత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో బ్రహ్మాస్త్ర మేకర్స్ ఓటిటి డీల్ కుదుర్చుకున్నారు. అలానే స్టార్ మా తో బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ కి సంబంధించిన శాటిలైట్ హక్కుల ఒప్పందం జరిగిందని తెలుస్తుంది.
రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్ ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు.