తను పనిచేసే సినిమాల నుండి సూపర్ అప్డేట్లిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుంటాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. లేటెస్ట్ గా తమన్ తన అప్ కమింగ్ సినిమాల నుండి దివాళికి బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుందని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది.
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వరస స్టార్ హీరో సినిమాలకు పని చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ వారసుడు, మహేష్ బాబు SSMB 28, రామ్ చరణ్ RC 15, బాలకృష్ణ NBK 107, చిరంజీవి గాడ్ ఫాదర్... ఈ సినిమాలన్నిటికీ మ్యూజిక్ డైరెక్టర్ తమనే. ఇప్పుడు తమన్ ఇచ్చిన అప్డేట్ ఏ సినిమాకు సంబంధించిందో అర్ధం కాక ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు.
తమన్ ఇచ్చిన అప్డేట్ ను కొంతమంది వారసుడు ఫస్ట్ సింగిల్ గురించని, మహేష్ - త్రివిక్రమ్ మూవీ టైటిల్ అని... ఇలా పలురకాలుగా చెప్పుకుంటున్నారు. మరి, ఈ సినిమాలన్నిటిలో తమన్ ఇచ్చిన అప్డేట్ దేనిదో తెలియాలంటే దీపావళి రావాల్సిందే.