విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మరో సాలిడ్ ఫన్ రైడ్ మూవీ “F3”. సంచలన విజయం సాధించిన "F2"కి సీక్వెల్‌గా ఫ్రాంచైజీని “F3” ప్రారంభించారు. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా, సోనాల్ చౌహాన్, పోహా హెగ్డే ప్రత్యేక పాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమా థియేటర్లలో మంచి హిట్ కొట్టి ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అతి త్వరలో మన ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానున్నాయి మరియు ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషలలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాలూకా తమిళ వెర్షన్‌ను జీ తమిళ్‌లో ప్రసారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు భాషల్లోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరించేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉందనే చెప్పాలి.