ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజుకు 'పోకిరి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు 'తమ్ముడు', 'జల్సా' స్పెషల్ షోస్ ఇరు తెలుగు రాష్ట్రాలలో, ఓవర్సీస్లో భారీ ఎత్తున ప్రదర్శింపబడడం, వాటికి ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన రావడం అందరికి తెలిసిందే.
లేటెస్ట్ గా మరొక స్టార్ హీరో పుట్టినరోజు సందర్భంగా ఇంకొక క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ రీ రిలీజ్ కాబోతుంది. ఐతే, ఇందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఇంతకీ ఏ హీరో, ఏ సినిమా అనుకుంటున్నారా...! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన "వర్షం" సినిమా ప్రభాస్ పుట్టినరోజున అంటే అక్టోబర్ 23వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.