ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:37 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్నాడు. శ్రీధర్ గాధే దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని CBFC నుండి ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa