రెబల్ స్టార్ కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. 2022 సెప్టెంబర్ 11న ఆదివారం ఉదయం 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. 82 ఏళ్ల కృష్ణంరాజు 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశారు. కృష్ణంరాజు మొదట హీరోగా పరిచయమైనా తరువాత చాలా పాత్రలు విలన్ గా చేశారు. మొదటి సినిమా తర్వాత నేనంటే నేనే, భలే అబ్బాయిలు, బంగారు తల్లి, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్ళి లాంటి సినిమాల్లో విలన్ పాత్రలు వేశారు. 1977లో కే.రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ‘అమరదీపం’ కృష్ణంరాజు కేరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డునూ లభించింది.