సీనియర్ హీరోయిన్ అమల చాన్నాళ్ల తదుపరి వెండితెరపై కనిపించిన చిత్రం "ఒకేఒక జీవితం". శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, రోజురోజుకూ కలెక్షన్ల నెంబర్లను పెంచుకుంటూ పోతుంది. ఇందులో శర్వానంద్ తల్లిగా , అమల అద్భుతమైన హార్ట్ మెల్టింగ్ సెంటిమెంట్ సీన్లను పండించారు. శర్వానంద్ తల్లిగా సినిమాలో కీలక రోల్ పోషించారు అమల గారు.
ఈ రోజు అమల గారి పుట్టినరోజు కావడంతో ఒకేఒక జీవితం మూవీ టీం స్పెషల్ పోస్టర్ ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు. అలానే సినిమా నుండి "అమ్మ" అనే స్పెషల్ వీడియో సాంగ్ ను ఈ రోజు సాయంత్రం ఐదింటికి విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.