"నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం నుండి చాలా బాగుందే అనే మెలోడియస్ లిరికల్ సాంగ్ విడుదలైంది. మెలోడీ బ్రహ్మ స్వరపరిచిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్ ఆలపించగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన నచ్చావ్ అబ్బాయ్, లాయర్ పాపా అనే సాంగ్స్ కు శ్రోతల నుండి విశేష స్పందన వస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్నారు. కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు.
ఈ మూవీ సెప్టెంబర్ పదహారున విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa