యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకుని తిరిగి ఫార్మ్ లోకొచ్చింది.
అనుపమ నుండి రాబోతున్న తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం "బటర్ ఫ్లై". అనుపమ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా ఆకర్షించగలిగింది. నటి భూమిక కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఆర్వీజ్ స్వరపరిచిన 'హే పండు' అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా, అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఘంటా సతీష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిహాల్ హీరోగా నటిస్తున్నారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్ పై రవి ప్రకాష్, ప్రసాద్, ప్రదీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa