సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఎస్ఎస్ఎంబీ28' సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. మహేష్ బాబుకి ఇది 28వ సినిమా. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోను సోమవారం చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.