మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా "గాడ్ ఫాదర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు.
అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పుడిప్పుడే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవుతూ వస్తుంది. నయనతార, సత్యదేవ్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం మూవీ ఫస్ట్ సింగిల్ ను రేపు అంటే సెప్టెంబర్ 14న విడుదల చెయ్యబోతుందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది. చూడాలి, మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమౌతుందో...!
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.