సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రూపొందిన చిత్రం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి". ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి వచ్చేసరికి 2 గంటల 24 నిమిషాల 49 సెకన్లుగా ఉంది.
ప్రమోషనల్ కంటెంట్ విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.