టాలీవుడ్ స్టార్ హీరోల్లో, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాధ్ తో చేసిన "లైగర్" విడుదలైన రోజు లాస్ట్ ట్వీట్ చేసిన విజయ్ ఇక అప్పటి నుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు చనిపోయినప్పుడు ఆయనకు నివాళులర్పిస్తూ ఫస్ట్ ట్వీట్ చేసిన విజయ్ లేటెస్ట్ గా తనను తాను సింగిల్ ప్లేయర్ అని అభివర్ణించుకుంటూ స్టైలిష్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి, శివ నిర్వాణ డైరెక్షన్లో 'ఖుషి' అనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుంది.