ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది విడుదలైన 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ'లు వరుసగా విఫలం అవడంతో రవితేజ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు.ప్రస్తుతం రవితేజ అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్స్‌లో పెట్టాడు. ఇక మూడు చిత్రాలు ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్‌రాజ ఇటీవలే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేనితో ఓ సినిమాకు సైన్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభించనుంది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. కాగా ఈ చిత్రంలో రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. కార్తికేయ-2 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని పనిచేసిన విషయం తెలిసిందే. అనుపమతో ఉన్న సాన్నిహిత్యంతోనే కథను నెరేట్ చేయగా.. తను వెంటనే ఓకే చెప్పిందట. ఈ చిత్రంలో రవితేజ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలనలో ఉంచారట. రీవేంజ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ జాన్ విక్ చిత్రాన్ని బేస్ చేసుకుని దర్శకుడు కథను రూపొందించాడట.