'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ షోలో ప్రేమ, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "నేను ఏ ఫీల్డ్ లో ఉన్నానో, నా మైండ్ లో ఏం ఉందో, నేనెక్కడి నుంచి వచ్చాననే విషయాలు నా భాగస్వామి అర్థం చేసుకోవాలి. నన్ను సురక్షితంగా చూసుకోవాలి. అయితే ఇలాంటి వాళ్లు దొరకడం కష్టం. ఓసారి నేను నా అండాల్ని భద్రపరచుకుంటా లేదా ఒంటరి తల్లిగా ఉంటానని అడిగితే మా అమ్మ ఓకే అనేసింది" అని తెలిపింది.