కొన్నాళ్ల నుండి రాంగోపాల్ వర్మ పేరు న్యూస్ లో అంతగా వినిపించట్లేదని అనుకునేలోపే షాకింగ్ ట్వీట్లతో మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
ఆదివారం తెల్లవారుఝామున టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ టాలీవుడ్ సినీ పరిశ్రమను తీవ్రంగా విమర్శిస్తూ షాకింగ్ ట్వీట్లను చేసారు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినీ పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! అంటూ ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్ చేసారు. అలానే కృష్ణ, మురళీమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, కళ్యాణ్ లకు RGV చిన్న మనవి చేసారు. రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికి రాకుండా పోదు... ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని, ఆ మహోన్నత నటుడిని గుర్తు చేసుకుంటూ కనీసం రెండు రోజుల పాటు షూటింగులకు విరామం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |