టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు నాగచైతన్య నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "శైలజారెడ్డి అల్లుడు". అను ఇమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, నరేష్, మురళీశర్మ కీలకపాత్రలు పోషించారు.
సెప్టెంబర్ 13, 2018లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో డీసెంట్ హిట్ కొట్టింది, ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గోపి సుందర్ అద్భుతమైన మెలోడీని ఈ సినిమాకు ఇచ్చారు. తను వెతికిన తగు జత, శైలజ రెడ్డి అల్లుడు చూడే, గోల్డు రంగు పిల్ల, పెళ్లి పందిరి పాటలను ఇప్పటికీ శ్రోతలు వింటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa