ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బెంగాల్ టైగర్' కాంబో రిపీట్ కాబోతుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 04:21 PM

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నుండి 2015లో వచ్చిన చిత్రం "బెంగాల్ టైగర్". తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ కొట్టింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో 'రచ్చ' సినిమా తీసి మంచి గుర్తింపు పొందిన సంపత్ నంది ఈ సినిమాకు డైరెక్టర్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బెంగాల్ టైగర్ డైరెక్టర్ -హీరో కాంబో రిపీట్ కాబోతుందట. ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్న రవితేజ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం సంపత్ నందితో చేతులు కలిపినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే, త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రావొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa