ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నెక్ట్స్ ఏంటీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 09, 2018, 01:16 PM

సందీప్ కిషన్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘నెక్ట్స్ ఏంటి’. బాలీవుడ్‌లో ఫనా, హమ్‌తుమ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ దర్శకుడు తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. నవదీప్, పూనమ్‌కౌర్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. హైదరాబాద్, లండన్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి మనీష్‌చంద్ర భట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, డైలాగ్స్‌ః గోపు కిషోర్ రెడ్డి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa