SR కళ్యాణమండపం సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కిరణ్ అబ్బవరం నుండి రాబోతున్న కొత్త సినిమా "నేను మీకు బాగా కావాల్సినవాడిని". ఈ సినిమాలో సంజనా ఆనంద్ హీరోయిన్ కాగా శ్రీధర్ గాదె దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఆరింటికి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ హాల్ లో జరగబోతుంది.
ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దిగ్గజ దర్శకుడు లేట్ కోడి రామకృష్ణ కూతురు దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa