కొంచెంసేపటి క్రితమే "ది లైఫ్ ఆఫ్ రామ్" మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణగారు ఈ ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఎంగేజింగ్ గా ఉంది. ఆద్యంతం ఒక ఎమోషన్ తో కూడిన ఫీలింగ్ ను క్యారీ చేసింది.
సెప్టెంబర్ 17వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ గారు సమర్పిస్తున్నారు. తమిళంలో వెందు తనిందతుకాదు టైటిల్ తో రేపే విడుదల కాబోతుంది. శింబు, సిద్ధి ఇద్నాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు AR రెహ్మాన్ సంగీతం అందించారు.