పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీలోనే చాలా డౌన్ స్టేజ్ లో ఉన్నారు. ఆయన పెదనాన్న గారు, సినీ ఇండస్ట్రీలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ హీరో కృష్ణంరాజుగారు ఆదివారం మరణించడంతో ప్రభాస్ మరియు అతని ఫ్యామిలీ తీవ్ర శోకంలో మునిగిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల షూటింగ్ లు రీషెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రభాస్ కు సౌకర్యం కలిగించేందుకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సలార్ సినిమా ప్రస్తుత షెడ్యూల్ ను హల్ట్ చేసి వచ్చే నెలకు ముహూర్తం పెట్టిందని టాక్.
శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది.