పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం "ఖుషి" సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సంపాదించే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా "ఫస్ట్ డే ఫస్ట్ షో". జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ ఈ సినిమాకు కథను అందించారు.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి డైరెక్టర్లుగా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు హీరోహీరోయిన్లుగా నటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదలై థియేటర్లలో రన్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుగు ప్రఖ్యాత ఓటిటి ఆహాలో ఈ నెల సెప్టెంబర్ 23 నుండి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.