ఒక భాషలో విడుదలైన సినిమా సూపర్ హిట్ ఐతే ఆ సినిమా మరొక భాషలోకి రీమేక్ అవ్వడం సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణమైన విషయం.
లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కాటమరాయుడు" బాలీవుడ్ లో "కిసీ కా భాయ్ కిసీ కా జాన్" గా రీమేక్ అవుతుంది. హిందీలో ఈ సినిమాలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకటేష్ కీరోల్ లో నటిస్తున్నారు.
ఐతే, కాటమరాయుడు సినిమాకు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ రీమేక్ అనే విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. విషయమేంటంటే, పవర్స్టార్ కాటమరాయుడు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ ఐన "వీరం" సినిమాకు తెలుగు రీమేక్.
![]() |
![]() |