ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు రోజుల్లో రూ 150 కోట్ల క‌లెక్ష‌న్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 10, 2018, 03:23 PM

ద‌ర్శ‌కుడు మురుగదాస్ త‌మిళ హీరో విజయ్ తో రూపొందించిన త‌మిళ మూవీ ‘సర్కార్. ఈ మూవీ తొలి రోజు నుంచే హిట్ టాక్ స్వంతం చేసుకుంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తీసిన ఈ సినిమా, కొన్ని వివాదాలను ఎదుర్కొంటూనే వుంది. అయినా వసూళ్ల పరంగా దూసుకుపోతూనే వుంది. తొలి రెండు రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 150 కోట్ల క్లబ్ లోకి విజయ్ అడుగుపెట్టడం ఇది మూడోసారి. గతంలో ఆయన నటించిన ‘తెరి’ .. మెర్సల్’ సినిమాలు ఈ ఫీట్ ను సాధించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa